హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముగిసిన 9వ తరగతి మూల్యాంకనం

MDK: చేగుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 9వ తరగతి హిందీ, ఆంగ్ల పరీక్షల బాహ్య మూల్యాంకనం పూర్తయింది. మండల పరిధిలోని పేపర్లను ఇక్కడే మూల్యాంకనం చేశారు. ఈ ప్రక్రియ వల్ల విద్యార్థుల అసలు ప్రతిభ వెల్లడై, వార్షిక పరీక్షలకు బాగా సిద్ధపడటానికి ఉపయోగపడుతుందని ఎంఈఓ కృష్ణారావు, హెచ్‌ఎం సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు జగన్‌లాల్, మనోహర్‌రావు పాల్గొన్నారు.