హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధి కూలీలకు రోజుకు రూ. 600 ఇవ్వాలి: వ్యవసాయ కార్మిక సంఘం

KMM: ఎల్నినో ప్రభావంతో పంటలు లేక ఇబ్బందులు పడుతున్న కూలీలందరికీ ఉపాధి హామీ పనులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కేవీ రామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు నేలకొండపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. రోజుకు రూ.600 కూలి, ఏటా 200 రోజుల పని కల్పించడంతో పాటు రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని ఆయన కోరారు.