NGKL: కల్వకుర్తిలోని సావిత్రిబాయి పూలే ఒకేషనల్ జూనియర్ కళాశాలలో బతుకమ్మ ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ మహిళల ఐక్యతకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీక అని, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: కల్వకుర్తిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు


