హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంఏఎల్‌డీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎంపవర్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఆచార్య షేక్ కలందర్ భాషా అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి విశిష్టతకు బతుకమ్మ ప్రతీక అని తెలిపారు. ఆధునిక విద్యతో పాటు విద్యార్థులు మన సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.