హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలి

WGL: గీసుకొండ మండలం గంగాదేవిపల్లి ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలలో శుక్రవారం షీ టీమ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఎం. స్వాతి మాట్లాడుతూ సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని, సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.సైబర్‌ నేరాలపై 1930 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.