హైదరాబాద్: 28°C
తెలంగాణ

వారికి ఉచిత సహాయ పరికరాలు అందజేత: మంత్రి

KNR: చిగురుమామిడి, సైదాపూర్ మండలాల్లో అర్హులైన దివ్యాంగులు, వృద్ధులకు ఏడీఐపీ పథకం కింద ఉచిత సహాయ పరికరాలు అందించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వీల్‌చైర్లు, ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, కళ్లద్దాలు, కృత్రిమ అవయవాలు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 15లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, 27, 28, 29 తేదీల్లో పరికరాలు అందజేయనున్నారు.