హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ విగ్రహాల ధ్వంసం.. పండుగ వేళ విషాదం

MHBD: దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో బతుకమ్మ విగ్రహాలు ధ్వంసమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి విగ్రహం చేయి, తలతో పాటు పిల్ల విగ్రహం తల దెబ్బతిన్నాయి. గద్దెపై ఉన్న శిలాఫలకం కూడా తొలగించబడింది. బతుకమ్మ పండుగకు ఒకరోజు ముందు ఈ ఘటన జరగడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి, బాధ్యులను గుర్తించాలని కోరారు.