హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

SRCL: గంభీరావుపేట–లింగన్నపేట మధ్య నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్మాణ పనులను పరిశీలించిన ఆమె.. 160 మీటర్ల బ్రిడ్జితో పాటు ఇరువైపులా 300 మీటర్ల అప్రోచ్ రోడ్డు పనులను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. వారం రోజుల్లో బ్రిడ్జి పక్కన అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.