ELR: పోలవరం MLA చిర్రి బాలరాజుపై వచ్చిన ఆరోపణలపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. MLAపై విచారణ కోసం హై లెవల్ కమిటీని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. కొంతకాలంగా ఎమ్మెల్యే వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పార్టీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఇది సమగ్ర విచారణ జరిపి నివేదికను ఇవ్వనుంది. దీని ఆధారంగా తదుపరి చర్యలుంటాయని జనసేన తెలిపింది.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేపై విచారణ కమిటీ.. పవన్ ఆదేశం


