హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటు హక్కును వినియోగించుకున్న ఆర్టీసీ ఉద్యోగులు

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో శుక్రవారం ఉద్యోగులు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పదేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈసారి ఎన్నికలపై కార్మికుల్లో ఆసక్తి నెలకొంది. ఉద్యోగులు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో డిపోలో సందడి వాతావరణం నెలకొంది.