హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు: ఎంఈఓ

KMM: దసరా సెలవుల్లో వైరా మండలంలోని పాఠశాలల్లో తరగతులు నిర్వహించవద్దని శుక్రవారం ఎంఈవో చావా శ్రీనివాసరావు ఆదేశించారు. ఈ నెల 10 నుంచి 22 వరకు ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.