హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రకృతిని కాపాడటమే హైడ్రా లక్ష్యం: రంగనాథ్

HYD: హైదరాబాద్‌లో చెరువుల పునరుద్ధరణతో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇప్పటికే ఆరు చెరువుల పనులు పూర్తిచేయగా, రెండో దశలో మరో 14 చెరువుల పనులు చేపట్టామన్నారు. సీఎస్‌ఐఆర్‌-ఎన్ఈఈఆర్ఐ సదస్సులో మాట్లాడుతూ.. చెరువుల ఆక్రమణల తొలగింపు, అభివృద్ధితో భవిష్యత్ తరాలకు పర్యావరణహిత నగరాన్ని అందించడమే లక్ష్యమన్నారు.