BHNG: ఆలేరు పట్టణంలో బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని పెద్దవాగులో ఉన్న కంప చెట్లను తొలగించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు జేసీబీ సహాయంతో స్వచ్ఛవాగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ బీజని బాలమణి భాస్కర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంగడి ఆంజనేయులుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బతుకమ్మ పండుగ ఏర్పాట్లను ప్రారంభించిన చైర్ పర్సన్


