హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేయూ పీజీ పరీక్షలు వాయిదా

HNK: బతుకమ్మ పండుగ సందర్భంగా రేపు జరగాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయ దూరవిద్య PG మూడో సెమిస్టర్ పరీక్షలను 12వ తేదీకి వాయిదా వేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ తెలిపారు. పరీక్షలు ఉ. 10 నుంచి మ. 1 గంట వరకు జరుగుతాయన్నారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు మ.2 నుంచి సా. 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.