హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు'

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని శ్రీ నలంద పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మహిళా ఉపాధ్యాయులు, చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలను అందంగా అలంకరించి ఆడి పాడారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపల్ పాలడుగుల రవీందర్ మాట్లాడుతూ... తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి ప్రతీక బతకమ్మ పండుగ అని అన్నారు.