హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్థిక భరోసా.. రూ.70.08 లక్షల చెక్కులు

BDK: బూర్గంపాడు రైతు వేదికలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 70 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.70,08,120 విలువైన చెక్కులు అందజేశారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.