హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

PLD: నరసరావుపేట రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ పక్కన ఉన్న భవనంలో 40–45 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు కాఫీ రంగు ప్యాంటు, లేత రంగు పొట్టి చేతుల టీషర్టు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నరసరావుపేట వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.