హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు

KMM: కూసుమంచి మండలం చేగోమ్మ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు పాఠశాల ఆవరణంలో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల ప్రాముఖ్యతను పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినిలకు వివరించారు. అనంతరం బతుకమ్మను చెరువులో నిమజ్జనం చేశారు.