హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసంపూర్తి విద్యుత్ ఎండిపోతున్న వరి పంటలు

NRPT: దామరగిద్ద మండలంలో విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సీఎం నియోజకవర్గంలో 24 గంటల విద్యుత్ సరఫరా అవుతుండగా, నారాయణపేట నియోజకవర్గంలోని దామరగిద్దలో మాత్రం రోజుకు పది గంటలు కూడా సక్రమంగా విద్యుత్ అందడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో ఈ వ్యత్యాసానికి కారణమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.