హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కళాశాలలో బతుకమ్మ వేడుకలు

MNCL: హాజీపూర్ మండలం వేంపల్లిలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా షీ టీమ్ ఎస్ఐ ఉషారాణి పాల్గొని విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆమె అన్నారు. మహిళల భద్రత, రక్షణ కోసం షీ టీమ్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు.