RR: బాలికపై లైంగిక నేరం కేసులో నాగోల్ పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేసి న్యాయస్థానంలో ఆధారాలు సమర్పించారు. దీంతో ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు నిందితుడు గుంజి కోటేశ్వరరావుకు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.17 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.2 లక్షల పరిహారం మంజూరు చేసింది. పోలీసులను మల్కాజిగిరి సీపీ బి. సుమతి అభినందించారు.
తెలంగాణ
బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు


