హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో బీజేపీ జనతా వారధి కార్యక్రమం

E.G: రాజమండ్రిలోని స్థానిక క్వారీ ఏరియాలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా బీజేపీ ఇంఛార్జ్ రేలంగి శ్రీదేవి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. దివ్యాంగులకు ఆర్థిక సాయం, సీతానగరం మండలం కూనవరంలో భూ సమస్యలు, ఇళ్ల మంజూరు, రహదారుల అభివృద్ధి తదితర అంశాలపై వినతులు అందాయి.