BPT: చీరాల మండలం పేరాలలోని మసీదు సమీపంలో నూతన మద్యం దుకాణం ఏర్పాటును నిరసిస్తూ దళిత బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ జిలాని ఆధ్వర్యంలో స్థానిక మహిళలు ధర్నా చేశారు. మసీదు సమీపంలో దుకాణం వల్ల నమాజీలకు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని జిలాని తెలిపారు. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని దుకాణం ఏర్పాటును నిలిపివేయాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
దుకాణం ఏర్పాటును నిలిపివేయాలని డిమాండ్


