E.G: ఉండ్రాజవరం మండలం పసలపూడిలో పులి సంచార ప్రాంతంలో పశువులకు మేత వేసేందుకు అనుమతించాలని రైతులు డిమాండ్ చేశారు. పులి సంచరిస్తున్న ప్రాంతంలోకి వెళ్లేందుకు పోలీసులు ఆంక్షలు విధించడంతో రైతులు ఆందోళనకు దిగారు. పులి వేరే ప్రాంతంలో ఉంటే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని వారు ప్రశ్నించారు. పశువులు చనిపోతే తమను ఎవరు ఆదుకుంటారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పసలపూడిలో రైతులు, పోలీసుల మధ్య వివాదం


