MHBD: జిల్లా గూడూరు మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా పాలకవర్గం చర్యలు చేపట్టిందని సర్పంచ్ వాంకుడోత్ సునీత తెలిపారు. ఆమె ప్రత్యేక చొరవతో గ్రామంలోని కోతులను పట్టేందుకు సిబ్బందిని రంగంలోకి దించారు. గ్రామ ప్రజల సంక్షేమం, రక్షణ తమ తొలి ప్రాధాన్యమని సర్పంచ్ పేర్కొన్నారు.స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
కోతులు లేని గ్రామమే లక్ష్యం: సర్పంచ్


