హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానసిక ఆరోగ్య పరిరక్షణపై న్యాయ విజ్ఞాన సదస్సు

MLG:  ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యంపై న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి కె చండీశ్వరి దేవి మాట్లాడుతూ మద్యపానం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అనంతరం ఉచిత కౌన్సెలింగ్ కోసం 14416 టోల్‌ఫ్రీ నంబర్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.