హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వెంటనే ఉపాధ్యాయులను నియమించాలి'

ADB: గాదిగూడ మండంలోని చిత్తగూడ PVTG పాఠశాలలో వెంటనే ఉపాధ్యాయులను నియమించాలని శుక్రవారం పలువురు పీవో మంద మకరందుకు వినతి పత్రం అందజేశారు. అక్కడ 1 నుంచి 7వ తరగతి వరకు సుమారు 200 మంది విద్యార్థులు విద్య అభ్యసిస్తున్నామన్నారు. కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండడంతో విద్య బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. త్వరలో ఉపాధ్యాయ సిబ్బందిని నియమించాలని కోరారు.