WGL: కాకతీయ యూనివర్సిటీ 24వ స్నాతకోత్సవాన్ని నవంబర్ 28న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో KU వీసీ ఆచార్య కె. ప్రతాప్ రెడ్డితో కలిసి పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ కట్ల శుక్రవారం హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్, ఛాన్సలర్ శివ ప్రతాప్ శుక్లాను కలిశారు. స్నాతకోత్సవ విధివిధానాలు, అవార్డులు, బంగారు పతకాలు, ఏర్పాట్ల వివరాలను వివరించారు.
తెలంగాణ
గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన KU VC


