హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువు కట్టలను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు

RR: ఆమనగల్లు మున్సిపాలిటీలోని సురసముద్రం చెరువు కట్ట తొలగింపుపై పత్రికా కథనానికి స్పందించిన ఇరిగేషన్ డీఈఈ ప్రతాప్‌రెడ్డి శుక్రవారం కట్టను పరిశీలించారు. దెబ్బతిన్న కట్టను త్వరలోనే పునరుద్ధరిస్తామని తెలిపారు. జలవనరులు, చెరువు కట్టలను ధ్వంసం చేసినా, అక్రమంగా మట్టి తరలించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.