హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి: ఎమ్మెల్యే

WGL: ఎస్సీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు అన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఎస్సీ సంక్షేమ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, పదోన్నతులు, ఎస్సీ ఉప ప్రణాళిక నిధుల వినియోగంపై సమీక్షించారు. నిధులు లక్ష్యాలకు అనుగుణంగా ఖర్చు చేయాలని సూచించారు.