హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెడ్ కానిస్టేబుల్‌ను పరామర్శించిన ఎస్పీ

PLD: నరసరావుపేట ఎస్పీ జగదీష్ అదహళ్లి శుక్రవారం గజ్జల బ్రహ్మారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దుర్గి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ జె. నరసింహారావును పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ, ఆపద సమయంలో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.