హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు నష్టం కలిగిస్తున్న అడవిపందులు

MNCL: కాసిపేట మండలం చిక్రంగూడలో అడవి పందులు పత్తి పంటపై దాడి చేస్తూ రైతులకు నష్టం కలిగిస్తున్నాయి. సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో ధ్వంసమవుతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నా అడవి పందుల బెడద తప్పడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పంటల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.