NLG: పత్తి పంటలో అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ సాగు పద్ధతులు పాటించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. శుక్రవారం గట్టుప్పల్ రైతు వేదికలో కాపస్ కాంతి మిషన్ కార్యక్రమంలో భాగంగా పత్తి విత్తనాల విత్తే విధానం, అధిక సాంద్రత సాగుపై శిక్షణ ఇచ్చారు. ఆముదం, ఆరుతడి పంటల సాగు విధానాలను వివరించారు. ఏడీఏ వేణుగోపాల్, ఏవో మైల రేవతి, ఏఈవోలు రైతులు ఉన్నారు.
తెలంగాణ
పత్తి సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ


