గద్వాల మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న అర్షియా తెలంగాణ సబ్ జూనియర్ త్రోబాల్ జట్టుకు ఎంపికైంది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు కోల్‌కతాలో జరిగే 34వ జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున పాల్గొననుంది. ఈ విషయాన్ని ప్రిన్సిపల్ భవాని, వ్యాయామ ఉపాధ్యాయురాలు రాధ తెలిపారు.
తెలంగాణ
జాతీయ త్రోబాల్ పోటీలకు గద్వాల విద్యార్థిని


