GNTR: జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ సిబ్బంది నుంచి వినతులు స్వీకరించారు. బదిలీలు, పదోన్నతులు, సెలవులు, వైద్య అవసరాలు, ఇతర సమస్యలను నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది సంక్షేమం, క్రమశిక్షణ, సమయపాలన, ప్రజలతో మర్యాదపూర్వక ప్రవర్తనకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సిబ్బంది వినతులు స్వీకరించిన ఎస్పీ


