హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగో రోజుకు చేరిన పారామెడికల్ సిబ్బంది మహాధర్నా

సత్యసాయి జిల్లా పుట్టపర్తి పీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట పారామెడికల్ సిబ్బంది చేపట్టిన ఆందోళన శుక్రవారం నాలుగో రోజుకు చేరింది. తమ డిమాండ్ల సాధనకై వారు మౌన దీక్ష చేపట్టారు. డైరెక్ట్ పారామెడికల్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, గ్రాస్ శాలరీ చెల్లించడంతో పాటు పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.