హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మరేంపల్లిలో ఎమ్మెల్యే ప్రజాదర్బార్

ATP: గుమ్మఘట్ట మండలం మరేంపల్లిలో MLA కాలవ శ్రీనివాసులు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించడమే ప్రజాదర్బార్ లక్ష్యమని తెలిపారు.