తెలంగాణ
రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లకు తీవ్ర గాయాలు
గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లి స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. దసరా సెలవులకు కుమార్తెను పుల్లూరు వసతి గృహం నుంచి స్వగ్రామానికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కోదండాపురానికి చెందిన తండ్రీకూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


