హైదరాబాద్: 28°C
తెలంగాణ

పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

GWDL: గద్వాల మండలం పూడూరు, కొండపల్లి గ్రామాల్లో శాస్త్రవేత్తలు డాక్టర్ పి. అర్చన, ఎ. శ్రీరామ్ శుక్రవారం పంటలను పరిశీలించి రైతులకు పలు సలహాలు అందించారు. పత్తిలో గులాబీ రంగు పురుగు, వరిలో పానికిల్ మైట్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చారు. అలాగే మిరప, బెండ, కంది పంటల సాగు యాజమాన్యంపై సాంకేతిక సలహాలు అందజేస్తూ, తెగుళ్ల ఉధృతిని అరికట్టేందుకు అవసరమైన జాగ్రత్తలను వివరించారు.