NLG: దేవరకొండ మండలం మైనంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ రాంసింగ్ నాయక్, మాజీ ఎంపీటీసీ కొర్ర గౌతమి పాల్గొని మాట్లాడుతూ.. పండుగలు మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. పండుగ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంబేద్కర్, ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి ఉన్నారు.
తెలంగాణ
పండుగల విశిష్టతను తెలుసుకోవాలి: రాంసింగ్


