ADB: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ పండుగ సంబరాలను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల విద్యార్థినులు, సిబ్బంది సాంస్కృతిక పాటలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. సాంప్రదాయ వేషధారణలతో వచ్చిన యువతులు పూల బతుకమ్మలను పేర్చి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో కళాశాలలో సందడి వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు


