హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్పెషల్ టెట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: జేసీ

అన్నమయ్య జిల్లాలో ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న ఏపీ స్పెషల్ టెట్–2026 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో 1,616 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, వైద్య సేవలు, పోలీస్ బందోబస్తు, రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు.