హైదరాబాద్: 28°C
తెలంగాణ

​పారిశుద్ధ్య లోపాలపై కమిషనర్ ఆగ్రహం

SDPT: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో చెత్త పేరుకుపోవడంపై మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున అసహనం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణపై మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డా. సంగీత, DMHO డా. ధనరాజు, RMO డా. శ్రావణితో కలిసి ఆయన అత్యవసర సమీక్ష చేపట్టారు. ఆసుపత్రిలో పరిశుభ్రత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.