హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సిరిమానోత్సవం పండగకు చిన్న శ్రీనుకి ఆహ్వానం

విజయనగరం ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, ఇతర పండుగ కార్యక్రమాలకు మాజీ జడ్పీ చైర్మన్, టీడీపీ నాయకులు మజ్జి శ్రీనివాసరావుని ఆలయ పూజారులు ఇవాళ మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేసి, పూజా కార్యక్రమాలు, ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. ఈ సందర్బంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని శ్రీను కోరారు.