BHPL: కొత్తపల్లిగోరి మండల కేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో వీధి కుక్కల సంచారం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రింబవళ్లు రోడ్లపై తిరుగుతూ వాహనదారులకు అడ్డంకిగా మారుతున్నాయి. పిచ్చికుక్కలు వెంటపడటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు బయటికి రావడానికి భయపడుతున్నారు. ఈ సమస్యపై అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: కొత్తపల్లిగోరిలో వీధి కుక్కల బెడద


