హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫారెస్ట్ ఆఫీసర్ కీలక వ్యాఖ్యలు

MLG: అటవీ భూముల్లో కొత్త పోడుసాగును అడ్డుకునే సమయంలో కొందరు గుత్తికోయలు కత్తులతో వచ్చి చంపుతామని బెదిరించినట్లు ఏటూరునాగారం రేంజర్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. ఏటూరునాగారం ఫారెస్ట్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వన్యప్రాణి వారోత్సవాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. కొండాయి, ఐలాపురం ప్రాంతాల్లో ఘటనలు జరిగాయని, అడవుల నరికివేతను అడ్డుకోవడం తమ బాధ్యత అని అన్నారు.