హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు..

MHBD: లోని పలు పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల బతుకమ్మలతో, కోలాటాలతో, నృత్యాలతో అలరించారు. చిన్నారులు రాముడు, సీత, రావణుని వేషధారణలో వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. పాఠశాలల ఆవరణాన్ని బతుకమ్మలు, మామిడి తోరణాలు, పూలతో అందంగా అలంకరించారు. ఉపాధ్యాయులు బతుకమ్మ పండుగ విశిష్టతను చాటి చెప్పారు.