హైదరాబాద్: 28°C
తెలంగాణ

చిరుత దాడిలో లేగదూడ మృతి

KMR: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మోతే గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు గొల్ల ప్రభాకర్ గురువారం సాయంత్రం తన వ్యవసాయ క్షేత్రంలో పశువులను కట్టేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా మూడేళ్ల లేగదూడ చిరుత దాడిలో మృతి చెందినట్లు గుర్తించాడు.