SRCL: వేములవాడ భగవంతరావునగర్‌లోని స్థానిక తపాలా కార్యాలయాన్ని ప్రపంచ తపాలా దినోత్సవం సందర్భంగా న్యూ అర్బన్ కాలనీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సందర్శించారు. ఈ సందర్భంగా తపాలా కార్యాలయ విధులు, ప్రజలకు అందించే సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు విక్కుర్తి లక్ష్మీనారాయణ, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
తపాలా కార్యాలయాన్ని సందర్శించిన విద్యార్థులు


