MDK: విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన విషాద సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సార్గు శ్రీనివాస్(40) ఉదయాన్నే పొలం పనులకు వెళ్లాడు. విద్యుత్ స్తంభం నుంచి తెగి గడ్డిలో పడి ఉన్న వైరు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని కుమారుడు నవీన్ పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో రైతు మృతి


